calender_icon.png 27 December, 2024 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం... ఉత్తంకుమార్ రెడ్డి

02-12-2024 11:37:01 PM

అనంతగిరి (విజయక్రాంతి): నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పౌరసరపాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. మండలానికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేశామన్నారు. చనుపల్లి నుండి కోదాడ వరకు 20 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు బిఆర్ఎస్ చెయ్యని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు. రైతాంగానికి  అధిక ప్రాధాన్యత ఇస్తు బడుగు బలహీన వర్గాల సామాన్యులకు వసతులు కల్పిస్తున్నామని అన్నారు.

రైతులకు కాలేశ్వరం ద్వారా నీటి చుక్క రాకపోయినా ఈ వానాకాలం రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 45 లక్షల మంది రైతు సోదరులు 1503 లక్షల మెట్ట వరి ధాన్యాన్ని పండించామని దేశంలో మరెక్కడ ఇంత పంట పండలేదని తెలిపారు. సన్న వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందిస్తున్నాం. సుమారుగా 40 వేల కోట్ల రూపాయలు ఈసారి వరి ధాన్యం పంట వల్ల రైతుల ఖాతాలో వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెనేపల్లి చందర్రావు, మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాసరెడ్డి, సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, పుల్లారెడ్డి ఈదుల కృష్ణయ్య, వేనేపల్లి వెంకటయ్య, ముత్తినేని కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.