12-02-2025 12:57:31 AM
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ
రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు
చర్ల, ఫిబ్రవరి 11 : ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేంతవరకు ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డిని నిలదీస్తూనే ఉంటామని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి వర్క్ సభ్యులు మధు స్పష్టం చేశారు. మంగ ళవారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆ ధ్వర్యంలో ఆరు గ్యారంటీల అమలు చేయాలని చర్ల బస్టాండ్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ధర్నా నిర్వహిం చారు.
ఈ ధర్నా ను ఉద్దేశించి ఆవునూరి మధు పాల్గొని మాట్లాడుతూ ఏమాయే రేవంత్ రెడ్డి ఎటుపాయే నీ ఆరు గ్యారం టీలు ప్రజలను మోసపూచ్చడంలో కెసిఆర్ ను తలదన్నావు. ఇందిరమ్మ ఇండ్లు ఎటు పాయే, రేషన్ కార్డులు ఏడబాయే, పోడు భూముల పట్టాలు ఊసే లేదు, ఆదివాసీల పై నువ్వు చూపించే ప్రేమ ఇదేనా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పాతర పెట్టావు.
చర్ల మండలంలో రహదా రుల సమస్య, ఇందిరమ్మ ఇండ్ల సమస్య, విద్యా, వైద్యం సమస్యలను పరిష్కరించా లన్నారు. అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిం చండని ఫిబ్రవరి 20వ తారీఖున 6 గ్యారంటీ అమలుకై చర్ల మండల ప్రజలు కదిలి రావాలని మధు పిలుపునిచ్చారు.
వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్లకు 4 వేల రూపాయలు తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని, మహిళలకు రూ.500 గ్యాస్ పథ కం అమలు చేయాలని ఆరోగ్యశ్రీ ఇవ్వాల ని ఆదివాసుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీలకు తునికాకు 50 ఆకుల కట్టకు రూ.6 రేటు పెంచాలని, లేకుంటే తిరగబడటం తథ్యమన్నారు.
కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమో క్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి సతీష్, పిఓడబ్ల్యు మహిళా సంఘం జిల్లా నాయ కురాలు సమ్మక్క, డివిజన్ కమిటీ సభ్యు రాలు సూర్యకాంతం, అరుణోదయ జిల్లా నాయకులు కొండలరావు, పిడిఎస్‌యూ మండల నాయకుడు రాజేష్ పాల్గొన్నారు.