బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. మనసిచ్చిన జహీర్ ఇక్బాల్నే మనువాడింది. గత ఏడేళ్లుగా రిలేషన్లో ఉన్న ఈ జంట పెళ్లి ముంబయిలో ఆదివా రం జరిగింది. అయితే పెళ్లి వార్తను అభిమానులతో పంచుకుంటూ ఈ జంట సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్‌ను చదవడానికి కూడా అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. సోనాక్షి తన ఇన్‌స్టాలో ‘సరిగ్గా ఏడేళ్ల క్రితం అంటే.. 2017, జూన్ 23వ తేదీన మేము ప్రేమలో పడ్డాం. అన్ని సవాళ్లనూ దా టి ఈరోజు విజయం సాధించాం.
ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాం. ఇరువురి కుటుంబాలు, దేవు ళ్ల ఆశీర్వాదంతో భార్యాభర్తలమ య్యాం. ఇకపై కూడా ఒకరినొకరం ప్రేమించుకుంటూ, అన్ని విషయాల్లో నూ కలిసి కట్టుగా ఉంటాం’ అంటూ రాసుకొచ్చింది. మరోవైపు సోనాక్షి ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుం డా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం ఆసక్తిగా మారింది. పెళ్లి సమయంలోనూ ఆమె ధరించిన వస్త్రాలు, ఆభరణాలపై ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.
తల్లి పూనమ్ సిన్హా పెళ్లి నాటి చికంకారీ చీరతోపాటు కొన్ని నగలను సోనాక్షి తన వివాహ సమయంలో ధరించి, ఆ వెంటనే నిర్వహించిన రిసెప్షన్‌కు మాత్రం చాంద్ బుట్టా, జరీ బార్డర్ ఉన్న సింధూరం రంగు బనారస్ చీరలో మెరిసింది. ఈ చీరలో రిసెప్షన్ వేదికపై సోనాక్షి భర్తతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం ది. ఈ నూతన వధూవరులు 2022లో విడుదలైన ‘డబుల్ ఎక్స్ఎల్’ అనే బాలీవుడ్ చిత్రంలో తొలిసారి కలిసి నటించారు.