calender_icon.png 28 December, 2024 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణ జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తాం..

03-12-2024 06:16:29 PM

దళిత జన సమితి అధ్యక్షులు బొజ్జ యాదగిరి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరిగేంతవరకు తాము పోరాటం కొనసాగిస్తామని దళిత జన సమితి ప్రకటించింది. వర్గీకరణ కోసం గత మూడు దశాబ్ధాలుగా మాదిగలు పోరాటాలు చేస్తున్నారని, సుప్రీంకోర్టు వర్గీకరణకు రాజ్యాంగ బద్దమైన తీర్పు ఇచ్చిందని సమితి నాయకులు తెలిపారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ యాదగిరి, పి.చంద్రమౌళి, కార్యనిర్వాహక అధ్యక్షుడు బొజ్జ రమేష్ తదితరులు మాట్లాడుతూ.. వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏలాంటి జాప్యం చేయకుండా ఆమోదం తెలపాలని కోరారు.

వర్గీకరణ అమలు జరిగితే మాదిగలకు విద్యా, ఉద్యోగ తదితర రంగాలలో అభివృద్ధి చెందుతారని చెప్పారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు సభలు, సమావేశాలు, ధర్నాలు చేపట్టిన వర్గీకరణ అమలును అడ్డుకోలేరని, వర్గీకరణ జరిగితే మాల, మాదిగలు అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి ఫలాలను సాధించుకోవచ్చునని సూచించారు. మేధావులని చెప్పుకుంటున్న మాలలు, ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి తదితరులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. ప్రైవేటు రంగంలో కూడా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సమితి నాయకులు గంగాధర్, రాకేష్, చొప్పరి బాలన్న, సంవత్, కుమార్ పాల్గొన్నారు.