సమ్మెపై తప్పుడు ప్రచారం తగదు
జిసిసి సివిల్ సప్లైహమాలి కార్మికుల దర్నాలో నాయకుల డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సివిల్ సప్లై, జిసిసి హమాలీల కార్మికుల పెరిగిన రేట్ల జీవో విడుదల చేసి, బకాయిలు చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదని CITU రాష్ట్ర కోశాధికారి, హమాలి యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వంగూరు రాములు, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటిప్రసాద్ డిమాండ్ చేశారు. జిసిసి, సివిల్ లప్లై హమాలి కార్మికులు 6 రోజులుగా చేస్తున్న, సమ్మేలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దర్నా నిర్వహించారు. CITU జిసిసి హమాలి యూనియన్ కార్యదర్శి మెుగిలి అధ్యక్షతన జరిగిన దర్నాలో నాయకులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 178 మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో (ఎం.ఎల్.ఎస్) సివిల్ సప్లై, గిరిజన సహకార సంస్థల్లో (GCC) 3600 మంది హమాలీలు పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను చెందిన దళితులే ఎక్కువగా ఉన్నారు.
వీరంతా రోజు బరువులు మోస్తూ మండల స్టాక్ పాయింట్ల నుండి బియ్యం ఇతర సరుకులు డీలర్ షాపులకు, పాఠశాల్లో పేద పిల్లల మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలకు, హాస్టల్ పిల్లలకు ఎగుమతి దిగుమతి చేయటంలో హమాలీలు ప్రధాన భూమిక పోషిస్తున్నారని వీరిపట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందని విమర్శించారు. హమాలీలకు మహిళా స్లీపర్లకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆనవాయితీ గత కొన్నాల్లుగా కొనసాగుతుంది. పాత ఒప్పందం 2023 డిసెంబర్ తో ముగిసింది. 2024 జనవరి 1 నుండి కొత్తగా ఒప్పందం చేసి రేట్లు పెంచి అమలు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం కారణంగా పలుమార్లు సివిల్ సప్లై రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్ద హమాలీలు నిరసనలు ఆందోళనలు చేయటంజరిగిదనిపోరాటల ఫలితంగా 2024 అక్టోబర్ 4న సివిల్ సప్లై అధికారులు కమిషనర్ గారి సమక్షంలో కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి గతంలో ఉన్న రూ,26/- నుండి రూ,29/- పెంచ్చారు. కింటాకు అదనంగా 3/-రూపాయలు మాత్రమే పెంచారు.
మహిళ స్వీపర్ల కు అదనంగా రూ,1000/- బోనస్ 6500 నుండి 7500 కు, డ్రెస్సు కుట్టుకొని 1300 నుండి 1600 కు స్వీట్ బాక్స్ కు 800/- నుండి 900/- పెంచుతూ, ఈ పెరిగిన రేట్లను 2024 జనవరి ఒకటి బకాయిలు కూడా చెలిస్తామని, సివిల్ సప్లై హమాలీలలే జిసిసి హమాలీలకు పి ఎఫ్ అమలు చేస్తామని వారం రోజుల్లో జీవో విడుదల చేసి అమలు చేస్తామని చర్చల సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఒప్పందం జరిగి హమాలీల రేట్లు పెంచి 3 నెలలు గడిచినGOఇవ్వనికారణంగా పెరిగినరేట్లుఅమలుకావటంలేదన్నారు. పలుమార్లు జీవో గురించి అడిగినా,,దర్నాలుచేసినా సివిల్ సప్లై అధికారుల నుండి ఎలాంటి సానుకూల స్పందన లేని కారణంగానే 2025 జనవరి 1 నుండి సివిల్ సప్లై హమాలీలు సమ్మె తలపెట్టామన్నారు. ప్రభుత్వం వెంటనేసివిల్ సప్లై, జిసిసి హమాలీల జరిగిన రేట్ల ఒప్పందం ప్రకారం వెంటనే జీవో విడుదల చేసి సమ్మె విరమింప చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజావాణిక కార్యక్రమంలో DRDA PDకి వినతిపత్రం అందజేశారు. సమస్య తీవ్రతను కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తామని హావిు ఇచ్చారు. ఈ దర్నాలో CITU జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మాచారి, AITUC జిల్లా జాయింట్ సెక్రెటరి నగేష్, టియుసిఐ నాయులు సీతారాములు, AITUC నాయకులు సదానందం, CITU జిల్లా నాయకులు పిట్టల అర్జున్, డొడ్డారవి, కెసత్య, నాయకులు రమణయ్య, CITU నాయకులు ఉప్పలయ్య, సత్యం, అయిలయ్య, లింగారెడ్డి, కోరం శ్రీను తదితరులు పాల్గొన్నారు.