15-04-2025 12:00:00 AM
టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి హుస్సేని ముజీబ్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం టీఎన్జీవోస్ తెలంగాణ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేని ముజీబ్ హైదరాబాద్‌లోని టీఎన్జీవోస్ యూనియన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నతి కోసం పాటుపడతామని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలుపరచడం కోసం పోరాటం చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్ విక్రమ్, కార్యదర్శి కురాడి శ్రీనివాస్, అసోసియేటెడ్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, కోశాధికారి బాల్‌రాజు, సెంట్రల్ యూనియన్ స్పోర్ట్స్ సెక్రటరీ శంకర్, ఈసీ సభ్యులు శ్రీముఖి, ఏపీఆర్వో వహీద్, 4వ తరగతి ఉద్యోగుల సంఘ కార్యదర్శి ఖాదర్, కోశాధికారి ధనరాజు, జూపార్క్ అధ్యక్షుడు నరేందర్, ఈఎన్‌టీ అధ్యక్షుడు తూముకుంట రాజు, గ్రంథాలయ సంస్థ అసోసియేట్ ప్రెసిడెంట్ మహేందర్, కార్యదర్శి వరప్రసాద్, ఈఎస్‌ఐ అధ్యక్షుడు రాజుకుమార్, ఐటీఐ అధ్యక్షుడు సత్యనారాయణ, డెంటల్ కళాశాల అధ్యక్షుడు హరీశ్, రామచందర్, కృష్ణ, పురుషోత్తం, హనుమంతు పాల్గొన్నారు.