calender_icon.png 20 November, 2024 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధునాతన సౌకర్యాలతో నూతన లైబ్రరీ నిర్మిస్తాం

20-11-2024 04:34:17 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీమంత్రి షబ్బీర్ అలీ

కామారెడ్డి (విజయక్రాంతి): అధునాతన సౌకర్యాలతో నూతన లైబ్రరీ నిర్మాణం కోసం కృషి చేస్తానని మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా గ్రంధాలయంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హాయంలో గ్రంథాలయాలకు రావాల్సిన రెండు శాతం సెస్ పన్ను రాలేదని అన్నారు. ప్రస్తుతం అలాంటి సమస్య లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.120 కోట్లతో 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రంథాలయంలో చదువుకొని ఉద్యోగాలు పొందిన యువకులను షబ్బీర్ అలీ సన్మానించారు. తొమ్మిది రోజుల పాటు సాగిన గ్రంధాలయ వారోత్సవాలు సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉరుదొండ వనిత రవీందర్, డి.ఎస్.పి నాగేశ్వరరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.