శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శీను బాబు...
మహదేవపూర్ (విజయక్రాంతి): మహాదేవపూర్ మండలంలో మినీ స్టేడియం నిర్మిస్తామని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుదిల్ల శీను బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో నిర్వహించిన శ్రీపాదరావు స్మారక క్రికెట్ క్రీడోత్సవాల ముగింపు సమావేశానికి హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం మాట్లాడుతూ మహదేవ్ పూర్ మండలానికి త్వరలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు. ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, కామెడీ శ్రీనివాస్ రెడ్డి, అశోక్, లేతకారి రాజబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.