calender_icon.png 13 April, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ పనులను తరితగతిన పూర్తి చేస్తాం...

13-04-2025 12:06:26 AM

రైలే స్టేషన్ ను సందరించిన డిఆర్‌ఎం...

డిఆర్‌ఎం కు పలు సమస్యలను వివరించిన ఎంపీ ఎమ్మెల్యేలు...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ రైలే స్టేషన్ ను రైలే డిఆర్‌ఎం ప్రదీప్ కాంబ్ల్ శనివారం సందరించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను, తదితర వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిఆర్‌ఎం ను శాలువతో సత్కరించారు. అనంతరం పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశం నిరహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఎం మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే రైలే సమస్యలపై పలు మార్లు చర్చించడం జరిగిందన్నారు. అదనపు రైళ్లు పొడిగించడం, పెండింగ్ లో ఉన్న పిట్ లైన్, రైలే అండర్ బ్రిడ్జి, రైలే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతంగా పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యే కృషితో రైలే శాఖ తరపున అవసరమైన అన్ని చర్యలు చేపట్టి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.  రైలే పిట్ లైన్ పనులు కొనసాగుతున్నాయని రెండు మూడు నెలలు పూర్తి అవుతాయని ఎంపీ నగేష్ తెలిపారు. రైలే డబల్ లైన్ సరే కోసం రైలే బోర్డు ఆర్డర్ ఇచ్చిందన్నారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిఆర్‌ఎమ్ కోరినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. అదిలాబాద్ జిల్లా నుండి కొత్త రైలులను ప్రారంభించాలని అన్నారు. రైలే కు సంబంధించిన సమస్యలు సాధ్యమైనంత తొందరగా కొలిక్కి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు..