calender_icon.png 1 January, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడేళ్లలో ఆర్‌ఆర్‌ఆర్ పూర్తి చేస్తాం

30-12-2024 02:20:25 AM

  1. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్ట్ ఆలస్యం
  2. ఈ రేసులో ఒకరో, ఇద్దరో జైలుకు ఖాయం
  3. రెడ్డి హాస్టల్ అల్యూమ్ని చైర్మన్‌గా మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): గత ప్రభుత్వం మొద్దు నిద్ర వల్లే రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజె క్టు ఆలస్యమైందని.. వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. “ఇటీవల ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసి అడగగా 20 రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్పారు..

చెప్పిన విధంగా టెం డర్లను పిలిచారు” అని మంత్రి తెలిపారు. ఆదివారం మంత్రిని రెడ్డి హాస్టల్ అల్యూమ్ని చైైర్మన్‌గా ఎన్నుకున్న నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. మంత్రిగా బిజీగా ఉన్నా.. హాస్టల్ అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తానని చెప్పారు. హాస్టల్ కోసం అవసరమైన ఎకరం కోసం ప్రభుత్వంతో చర్చించి బడ్జెట్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అన్ని వర్గాల ప్రజలకు విద్య అందుబాటులో ఉండాలనే ఆనాడు రాజా బహద్దూర్ వెంక ట రామారెడ్డి.. రెడ్డి హాస్టల్‌తో పాటు అనేక విద్యాసంస్థలను స్థాపించారని గుర్తు చేశారు. ఇంత మంచి ఆర్గనైజేషన్‌లో నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. 

ఓఆర్‌ఆర్‌పై సిట్ విచారణ..

ఓఆర్‌ఆర్‌ను అమ్ముకున్న వాళ్లపై విచారణకు ఆదేశించామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం రూ. 7,300 కోట్లకు ఓఆర్‌ఆర్‌ను అమ్ముకున్నదన్నారు. 50 శాతం తెలంగాణను నగరీకరణ చేసేందుకు ఉపయోగపడే అద్భుతమైన ప్రాజెక్టు రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అని తెలిపారు.

తాను మంత్రి పదవి చేపట్టిన రెండో రోజునే కేంద్రమంత్రి గడ్కరీని కలిసి ఆర్‌ఆర్‌ఆర్ గురించి విన్నవించినట్టు కోమటిరెడ్డి వివరించారు. రాజశేఖర్‌రెడ్డి జైకా సంస్థ ద్వారా రూ.6,500 కోట్ల రుణం తెచ్చి మూడేళ్లలో ఓఆర్‌ఆర్‌ను నిర్మించారన్నారు. 24 నెలల్లో శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టును నిర్మించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టు గుర్తుచేశారు.

అక్కడ భూమి విలువ సుమారు లక్ష కోట్లుంటే.. కేవలం రూ.7,300 కోట్లకు కేసీఆర్ అమ్ముకోవడం దారుణమన్నారు. తెలం గాణ ప్రజలకు కేంద్రం ఇచ్చిన కానుక రీజిన ల్ రింగ్ రోడ్డు పనులు మార్చిలో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. హరీశ్‌రావు కోరిక మేరకు ఆర్‌ఆర్‌ఆర్ టెండర్లపై ప్రభుత్వం సిట్ వేసిందన్నారు. అదే విధంగా ఈ ఫార్ములా రేసు కేసులో ఒకరో, ఇద్దరో జైలుకెళ్తారని మంత్రి పేర్కొన్నారు.