09-02-2025 01:40:19 AM
ఢిల్లీ ఎన్నికల స్ఫూర్తితో తెలంగాణలో గెలుపు కోసం కృషి : ఎంపీ ఈటల
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఢిల్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్ కు మార్గదర్శకంగా ఉండబోతున్నాయని, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశా రు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు..
దేశంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్రతోపాటు ఢిల్లీ ఎన్నికలు తేల్చాయన్నారు. తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను చూసిన ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించారని, ఇదే సమయంలో అబద్ధపు ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు చెప్పారు.
అతి తక్కువ కాలంలోనే ప్రజలతో ఛీకొట్టించుకున్న సీఎం.. రేవంత్‌రెడ్డి మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఎన్నికల స్ఫూర్తితో తెలంగాణలోనూ బీజేపీ గెలుపుకోసం కృషి చేస్తామని ఈటల చెప్పారు.