ఎమ్మెల్సీ తాతా మధు
ఖమ్మం, జనవరి 1 (విజయక్రాం తి): కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటాలు చేసి రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మం బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బాణోత్ చం ద్రావతి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ జి ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, నాయకులు తాజుద్దీన్, గుండాల కృష్ణ పాల్గొన్నారు.