calender_icon.png 5 April, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లులు క్లియర్‌చేస్తాం!

05-04-2025 01:52:38 AM

  1. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
  2. ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి హామీ

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని, సమస్యలను పరిష్కరిస్తామని ఉద్యోగుల జేఏసీ నేతలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హామీ ఇచ్చారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ప్రజాభవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈసందర్భంగా రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎంకు లచ్చిరెడ్డి వివరించారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌తోపాటు రాష్ర్ట స్థాయిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అంశాలను పేర్కొన్నారు.

ఉద్యోగుల జేఏసీ చైర్మన్, నాయకుల వినతిపై సానుకూలంగా స్పందించిన భట్టి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే రామకృష్ణ, టీజీటీఏ రాష్ర్ట అధ్యక్షుడు రాములు, జనరల్  సెక్రటరీ రమేశ్ పాక తదితరులు ఉన్నారు.