calender_icon.png 5 February, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిగతా రాష్ట్రాల కంటే ముందే ఎస్సీ వర్గీకరణ చేస్తాం

05-02-2025 02:00:59 AM

  1. వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
  2. దశాబ్దాల కల సాకారం
  3. మంత్రి దామోదర రాజనర్సింహ 

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేస్తున్నారని.. సుప్రీం కోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం అన్నారు.

ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ప్రకటన సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దళితులకు అన్ని రంగాల్లో అపార అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని.. తాను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. తన రాజకీయ జీవితంలో నాకు ఆత్మ సంతృప్తిని కలిగించిన రోజు ఇదేనని పేర్కొన్నారు. ఇలాంటి అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందన్నారు.

చరిత్ర పుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. వర్గీకరణకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ర్ట ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టిం దన్నారు. అతితక్కువ సమయంలో సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు.

ఆనాడుఎస్సీ ఉపకులాల వర్గీకర ణకు వాయిదా తీర్మానం ప్రవేశపెడితే తనను సభ నుంచి బయటకు పంపించారని గుర్తుచేశారు. కానీ ఈనాడు సభా నా యకుడిగా వర్గీకరణ అమలుకుకు సభలో నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందన్నారు.

రంగుల గోడలు.. అద్దాల మేడలు కాదు చివరి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలన్న అంబేద్కర్ ఆశయానికి అనుగు ణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందుకు సభ్యులందరి సహకారం ఉండాలని కోరుతున్నామన్నారు. 

కాంగ్రెస్ నిబద్దతకు నిదర్శనం 

కాంగ్రెస్ ఎప్పుడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరికి విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక అవకాశాలను అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించారన్నారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజే.. రాష్ట్రంలో తాము అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు.

ఇది కాంగ్రె స్ నిబద్ధతకు నిదర్శనమన్నారు. సామాజిక న్యాయం విషయంలో కాంగ్రెస్ భారత రాజకీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిం దన్నారు. బాబూ జగ్జీవన్ రామ్, దామోదరం సంజీవయ్య వంటి నేతలను కీలక పదవులు ఇచ్చిందన్నారు. 1980లో దళిత సమాజాల్లో అలజడి, అసంతృప్తి చెలరేగడంతో ఉద్యమాలు మొదలయ్యా యన్నా రు.

రిజర్వేషన్ల అవకాశాలు అన్ని వర్గాలకు సమానంగా రావాలని తెలుగు రాష్ట్రంలో ఉద్యమం జరిగిందన్నారు. చంద్రబాబు హయంలో అమలు చేసిన వర్గీకరణ వల్ల చాలా మంది ఎస్సీ ఉపకులాలకు అవకాశాలు పెరిగాయన్నారు. 2004లో రాజశే ఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఉషా మెహ్రా కమిషన్ వేశారన్నారు. రాజ్యంగ ఫలాలు అందిరికీ అందాలన్నదే కాంగ్రెస్ విధానమన్నారు. చేవేళ్ల డిక్లరేషన్‌లోనూ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించారన్నారు.  

వర్గీకరణకు బీజేపీ కృషి చేసింది: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఎస్సీ వర్గీకరణకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. వర్గీకరణ కోసం మందృకృష్ణ ఇబ్బందిపడుతుండగా.. ప్రధాని మోదీ అండగా నిలిచారన్నారు. సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు.

మాల, మాదిగలు కలిసుండాలి: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం జరుగుతుందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్గీకరణ జరిగినా రెండు వర్గాలు కలిసి ముందు కెళ్లాల న్నారు. రెండు వర్గాలు కలిసి పోరాడితే హ క్కుల సాకారమవుతాయన్నారు. అలాగే, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎ స్సీ సబ్ ప్లాన్‌ను అమలు చేశారన్నారు. ఇ ప్పుడు దాన్ని తిరిగి అమలు చేయాలన్నారు. 

దశాబ్దాల కల సాకారం: మంత్రి దామోదర

ఇదొక చారిత్రక దినమని, మాదిగలు, ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కల సాకారం కాబోతోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 మాసాలకే వర్గీకరణ చేశామన్నారు. మంగళవారం శాపన సభలో ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రి మాట్లాడారు. ఇంకొకరు విమర్శించడానికి వీలు లేకుండా, పారదర్శకంగా వర్గీక రణ చేశామన్నారు.

వర్గీకరణ చేయడం  చరిత్రను పునర్మించబోతున్నామని స్పష్టం చేసా రు. ఎవరికి తాము వ్యతిరేకం కాదని, అంద రూ కుటుంబ సభ్యుల లాంటి వాళ్లే  అన్నా రు. రాబోయో రోజుల్లో వర్గీకరణపై తదుపరి ప్రక్రియను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దీనికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, సబ్ కమిటీలోని మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం, సీతక్క, ఎంపీ మల్లు రవికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే నివేదిక

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే వర్గీకరణ జరిగిందని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. 59 కులాలను మూడు కేటరిగీలా చేశామన్నారు. అవకాశాలు పొందని, బాగా వెనుకబడిన వర్గాలైన 3లక్షల 20వేల మంది జనాభాను ఒక కేటగిరీగా చేసి.. వారికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు.

మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలకు 9శాతం, మెరుగైన అవకాశాలను పొందిన వారికి మిగిన రిజర్వేషన్ కల్పించినట్లు చెప్పారు. మాటలు చెప్పడం కాదు, కమిట్‌మెంట్‌తో ఈ వర్గీకరణ చేశామన్నారు. కాంగ్రెస్ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. చరిత్ర నిలిచిపోయే నాయకుడినే దార్శనికుడు అంటారని మంత్రి పేర్కొన్నారు.

అనతికాలంలోనే వర్గీకరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఓ దార్శనికుడిగా మంత్రి అభివర్ణించారు. నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ గురించి అడిగితే.. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, సండ్ర వెంకట వీరయ్యను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసారు.