calender_icon.png 26 April, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రదాడికి పాల్పడ్డ వారిని పట్టుకుని శిక్షిస్తాం

25-04-2025 10:48:59 PM

నిర్మల్ (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతంలో పర్యాటకులతో పాటు సామాన్య ప్రజలను దాడి చేసి హత్య చేసిన ఉగ్రవాదులను పట్టుకొని కఠినంగా శిక్షించేలా మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్మల్ బిజెపి ఎమ్మెల్యే పీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్ దాడిని నిరసిస్తూ అమరులైన కుటుంబాలకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు మరణించిన వారికి శాంతి చేకూర్చాలని నినాదాలు చేశారు. భారతదేశంలో ఉగ్రవాద దానికి తావు లేదని అనేకసార్లు భారత ప్రభుత్వం ఉగ్రవాదాడులపై కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.