17-04-2025 05:56:24 PM
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం..
హుజురాబాద్ (విజయక్రాంతి): చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పాత వ్యవసాయ మార్కెట్ లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని తెలంగాణ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 15 నెలల పాలనలో రైతు సోదరులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
సన్నాలకు ఒక క్వింటాలకు 500 రూపాయల బోనస్, ఎరువులు, విత్తనాలు ఇచ్చిందన్నారు. మార్కెట్ కు వడ్లను తీసుకువచ్చే రైతు సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎండ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వారికోసం బార్ధన్ సంచులు టెంట్లు తాటిపత్రిలు మంచినీటి వసతి మజ్జిగ ప్యాకెట్లు మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కు తీసుకువచ్చే వడ్లు 41 కిలో కన్నా ఎక్కువ తీసుకుంటే రైతులు తమకు ఫిర్యాదు చేస్తే సహకార సంఘాల సెంటర్స్, ఐకెపి సెంటర్స్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
దళారులను నమ్మి ప్రైవేటుకు వ్యాపారస్తులకు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొనగంటి సంపత్, జమ్మికుంట తహసిల్దార్ గట్ల రమేష్ బాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ మల్లేశం, గ్రేట్ టు సెక్రెటరీ రాజు, జమ్మికుంట మండల రెవిన్యూ ఆర్ ఐ గడ్డం శంకర్, జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘం సీఈవో రవీందర్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ ఎర్రం సతీష్ రెడ్డి, జమ్మికుంట మండల అర్ధిదారుల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, జమ్మికుంట వ్యవసాయ సహకార సంఘం ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి. తో పాడు తదితరులు పాల్గొన్నారు.