calender_icon.png 30 April, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి ధాన్యపు గింజ వరకూ కొంటాం

30-04-2025 12:54:29 AM

  1. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఖమ్మం కలెక్టర్, అధికారులతో సమీక్షా సమావేశం

ఖమ్మం, ఏప్రిల్ 29 (విజయక్రాంతి):- యాసంగి పంటచివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై కొనుగోలు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం లోని తన నివాసంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ధాన్యం కొనుగోలు, భూభారతి చట్టం అమలు, ఇందిర మ్మ ఇండ్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో రైతులు పండించిన చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై కొనుగోలు చేయాలని, సన్న రకం వడ్లకు క్వింటాల్ 500 రూపాయల బోనస్ అందించాలని అన్నా రు.  ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతులకు త్వరగా చెల్లింపులు చేసేలా వివరాలను ఎప్పటి కప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.

యాసంగి పంటకు గాను జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 83 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, దీనికి గాను రైతులకు 85 కోట్ల 30 లక్షల రూపాయల చెల్లింపులు కూడా పూర్తి చేశామని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద మరో 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని అధికారులు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్స్‌కు తరలించాలని మంత్రి అన్నా రు.

కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని, కొనుగోలు కేంద్రా ల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ కోతలు ఉండడానికి వీలులేదని, రైతులకు ఎక్కడ నష్టం రాకుండా చూసుకోవాలని, కొనుగోలు కేం ద్రాల వద్ద గన్ని బ్యాగుల కొరత రాకుండా చూసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఏప్రిల్ నెలాఖరు నాటికి భూ భారతి రైతు సదస్సుల ద్వారా నేలకొండపల్లి మండలంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి రెవెన్యూ అధికారులకు సూచించారు. మనం 20 రెవెన్యూ గ్రామాలకు ఇప్పటివరకు 2380 దరఖాస్తులు స్వీకరించామని, వీటిలో వెంటనే పరిష్కారం చూపేందుకు అవకాశం ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. 

ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్‌కు ఆదేశం 

ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు గ్రౌండ్ చేయాలని అన్నారు. బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్న నిర్మాణాల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేస్తే లక్ష రూపాయ లను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అందించిన లబ్ధిదారుల జాబితాను మరో సారి క్షేత్రస్థాయిలో పరిశీలించి అనర్హులు ఎవరైనా ఉంటే తీసి వేయాలని అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, డిఆర్డీవో సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, డిఎం సివిల్ సప్లయిస్ శ్రీలత, డిఏఓ పుల్లయ్య, డిసిఓ గంగాధర్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, నేలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, అధికారులు, పాల్గొన్నారు.

నేలకొండపల్లిలో పర్యటించి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసిన  మంత్రి పొంగులేటి

ఖమ్మం, ఏప్రిల్ 29 ( విజయక్రాంతి ):-అభివృద్ధి, సంక్షేమం సమ ప్రాధాన్యతగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివా సరెడ్డి అన్నారు.మంగళవారం మంత్రి నేలకొండపల్లి మండలంలో పర్యటించి నాచేపల్లి గ్రామంలో కొత్త కొత్తూరు నుండి వల్లభి వరకు ప్లాన్ నిధులు  40 లక్షలతో చేపట్టిన రోడ్డు మరమ్మత్తు పనులకు, సుర్దేపల్లి గ్రామంలో సుర్దేపల్లి నుండి కిష్టారం హై లెవె ల్ బ్రిడ్జి వరకు 35 లక్షలతో చేపట్టిన రోడ్డు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యా ల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పేదల అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత నిస్తూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నా రు. ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకుంటూ, పేదవాడి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మన మధ్యలో ఉన్నాయని అన్నారు.

రాబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న యువతకు రాజీవ్ యువ వికాసం క్రింద స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఆర్ అండ్ బి ఎస్‌ఇ యాకుబ్, ఈఈ యుగంధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.