calender_icon.png 12 May, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం

22-04-2025 12:51:00 AM

దళారులను నమ్మి మోసపోవద్దు ; ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డి. 

బిజినేపల్లి ఏప్రిల్ 21 : రైతులు పండించిన ప్రతి గింజను కొనగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తామని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం రెక్కల కష్టం వర్షార్తనం అనే కథనాన్ని విజయ క్రాంతి ప్రచురించగా స్థానిక ఎమ్మెల్యే స్పందించారు.  నియోజకవర్గంలోని తిమ్మాజిపేట, బిజినపల్లి, తాడూరు, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను ఓదార్చారు.

రైతులు పండించిన ప్రతి గింజను తడిసిన ధాన్యమైన కొనుగోలు చేస్తామని, ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. రైతులు దళారులకు ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ వరి కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించి మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న క్వింటాలుకు రూ.500 బోనస్ లబ్ది పొందాలని సూచించారు.

దాన్యం కొనుగోలులో కొర్రీలు పెట్టకుండా సేకరించాలని ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ శాఖ అధికారులు కాంట్రాదారులను  ఆదేశించారు. ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేలకొరిగిన వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు.

ఆయన వెంట నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, పీఏసీఎస్ చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, ఐకేపీ ఏపీఎం విజయ, సీసీ ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కృష్ణయ్య, గోవిందునాయక్, పూల్యానాయక్, పాండు నాయక్, దాసర్ల సైదులు తదితరులు ఉన్నారు.