calender_icon.png 4 March, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామపక్షాలతో కలిసి బలమైన ఉద్యమాలు నిర్మిస్తాం

04-03-2025 12:51:31 AM

సీపీఎం రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ 

సూర్యాపేట, మార్చి 3: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి నెల మొత్తం వామపక్షాలతో కలిసి ఉద్యమాలను నిర్వహిస్తామని సిపిఎం రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సోమవారం  కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఆ పార్టీ నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అలాగే రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వర్గాలకు నిధులు కేటాయింపులకు మొండి చేయి చూపిందన్నారు. ప్రధానంగా దళితులు, బలహీన వర్గాలు, విద్య, వైద్యం రంగాలకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించలేదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం  పండించిన సన్న ధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని నేటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. రైతు భరోసా రైతులందరికీ అందించాలని కోరారు.

తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలలో ఎస్సారెస్పీ ద్వారా నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. . సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం రాష్ర్ట కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ విస్తృతస్థాయి  స్థాయి సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, డివైఎఫ్‌ఐ రాష్ర్ట అధ్యక్షులు కోట రమేష్, సిపిఎం రాష్ర్ట కమిటీ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.