calender_icon.png 5 November, 2024 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్‌కు నీళ్లిస్తాం

19-07-2024 04:05:00 AM

ప్రాణహిత నదిపై తుమ్మిడి హెట్టి వరద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ సందర్భంగా సచివాల యం నుంచి వివిధ జిల్లాల్లోని రైతులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండ్ల నాగాపూర్ గ్రామానికి చెందిన రైతు మహేందర్‌తో సీఎం ముచ్చటించారు. వారి మధ్య సంభాషణ ఇలా...

సీఎం: ఎంత భూమి ఉంది మహేందర్?

మహేందర్: ఎకరం భూమి ఉంది సర్.

సీఎం: రుణం ఎంత ఉంది?

మహేందర్: రూ.50 వేలు ఉంది సర్. ఏకకాలంలో రుణం తీర్చుతున్నందుకు సంతో షంగా ఉంది.

సీఎం: రైతులు, ఆదివాసుల కష్టాలు    తెలుసుకుంటుందనే సీతక్కను మీ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పెట్టాం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నావా? 

మహేందర్: ఉన్నాను సర్

సీఎం: రైతు రుణమాఫీ గురించి సోషల్ మీడియా ద్వారా చెబుతావా?

మహేందర్: చెబుతాను సర్.

సీఎం: ధన్యవాదాలు మహేందర్. మీ జిల్లాలో ప్రాణహితపై తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇస్తాం.

వరంగల్ సభకు రైతులను తీసుకొస్తా

వరంగల్‌లో నిర్వహించనున్న రాహుల్ గాంధీ కృతజ్ఞత సభకు తాను రావడంతోపాటు ఇతర రైతులను తీసుకొస్తానని వరంగ ల్‌కు చెందిన రైతు ఎల్లయ్య సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎల్లయ్యతో సీఎం మాట్లాడారు. 

ఎల్లయ్య: ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే పండుగ రోజులా కనిపిస్తోంది.

సీఎం: రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్‌లోనే చేశాం తెలుసా?

ఎల్లయ్య: తెలుసు సర్.. వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో రాహుల్‌గాంధీ వచ్చిన సభలో చేశారు.  ఆ మాట నిలబెట్టుకున్నారు.

సీఎం: ఆ సభకు వచ్చావా?

ఎల్లయ్య: వచ్చా సర్.

సీఎం: వరంగల్ సభ పెట్టి రాహుల్ గాంధీని పిలుద్దామా?

ఎల్లయ్య: పిలిచి కృతజ్ఞతలు తెలుపుదాం సర్. 

సీఎం: సభకు వస్తావా?

ఎల్లయ్య: తప్పకుండా వస్తాను. వరంగల్ జిల్లా అంటేనే రైతులు. సభకు నాతోపాటు రైతులకు తీసుకొస్తా సర్.

పిల్లలను మంచిగా చదవించాలి

అప్పుల్లో ఉన్నానని, రుణమాఫీతో ఎంతో సంతోషంగా ఉందని ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం బీ వెంకటాయపాలెంకు చెందిన రైతు  సీతారాం సీఎంకు తెలిపారు. 

సీతారాం: రుణమాఫీతో సంతోషం కలిగింది. యువ రైతులకు సాగు చేయాలనే సంకల్పాన్ని మీరు కల్పించారు.

సీఎం: సీతారాం.. భూమి ఎంత ఉంది? ఎంత అప్పు ఉంది?

సీతారాం: నాలుగున్నర ఎకరాల భూమి, రూ.78 వేల అప్పు ఉంది సర్.

సీఎం: మొత్తం రుణమాఫీ అవుతోంది కదా.. ఎలా ఉంది?

సీతారాం: చాలా సంతోషంగా ఉంది. మీరు చల్లగా ఉండాలి సర్.

సీఎం: పిల్లలు ఎంతమంది సీతారాం?

సీతారాం: ఇద్దరు పాపలు. పెద్ద పాప ఇంటర్, చిన్న పాప పదో తరగతి చదువుతున్నారు సర్.

సీఎం: ఇద్దరిని మంచిగా చదవించు, చదువు అపొద్దు.

సీతారాం: ఆపను సర్.. మంచిగా చదివిస్తా.

గత ప్రభుత్వాల తీరుతో నమ్మకం పోయింది

రుణమాఫీతో ఎంతో సంతోషంగా ఉందని, రైతులందరి తరుపున పాదాభివందనం చేస్తున్నానని సీఎంతో బోధన్ రైతు రవి అన్నారు. 

రవి: నాకు మాటలు రావడంలేదు. గతంలో ప్రభుత్వాలు, పార్టీలు రుణమాఫీపై హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో వడ్డీలు పెరి గి అప్పులు మిగిలిపోయాయి. రుణమాఫీపై ఎవరు హామీ ఇచ్చినా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పడు నమ్మకం కలిగింది. సంతోషంగా ఉంది.  మరో రాజశేఖర్‌రెడ్డిలా రేవంత్‌రెడ్డిని చూస్తున్నాం. రైతుల ఆశీస్సులతోనే రైతు రాజ్యం ఉంటుంది.

సీఎం: మీ నిజామాబాద్ జిల్లాకు రూ.225 కోట్లు రుణమాఫీ కింది ఇస్తున్నాం.

రవి: నాట్లు వేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నాం సర్.

సీఎం: అంకాపూర్ చికెన్ తినిపిస్తావా? (సరదాగా)

రవి: తప్పకుండా.. అంత అదృష్టం ఎలా వదులుకుంటాం సర్!