calender_icon.png 27 December, 2024 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డెరల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా

02-12-2024 01:13:50 AM

రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్

ముషీరాబాద్, డిసెంబర్ 1: ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వెనుకబడిన వడ్డెరుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్ అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో వడ్డే ఓబన్న తెలంగాణ వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య అధ్యక్షతన తెలంగాణ వడ్డెర యువగర్జన సభ జరిగింది.

ఈ కార్యక్రమానికి హాజరైన జెరిపాటి జైపాల్ మాట్లాడుతూ.. వడ్డెర కులస్తులు కొన్ని రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ  జాబితాలో కొనసాగుతున్నారని, తెలంగాణలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. భారతీయ వడ్డెర సమాజ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్ మౌర్య, సంఘం ప్రధాన కార్యదర్శి శివరాత్రి వెంకటేశ్, యూత్ సెక్రెటరీ రాఘవ్, ఉపాధ్యక్షుడు మహేశ్, ప్రధాన కార్యదర్శి సంపంగి ప్రభాకర్ పాల్గొన్నారు.