calender_icon.png 10 January, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

03-01-2025 01:08:43 AM

  1. రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్
  2. బషీర్‌బాగ్‌లో వడ్డెరుల రాష్ట్ర సదస్సుకు హాజరు

ముషీరాబాద్, జనవరి 2 : సంచార శ్రమ జీవులైన వడ్డెరులను గిరిజన తెగల(ఎస్టీ)లో చేర్చాలని అఖిల భారత వడ్డెర వోడ్, బోవి, బేల్ధా ర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డెరుల రాష్ట్ర సదస్సుకు రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. ఇతర సామాజిక వర్గాలకు ఇస్తున్న మాదిరిగా బీమా, రాయితీలు వడ్డెరులకు కూడా కల్పించే విధంగా ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటిని సాధించుకునేందుకు తనవంతు కృషిచేస్తానని అన్నా రు.

అఖిల భారత వడ్డెర వోడ్, బోవి, బేల్ధార్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంజుల హనుమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు తిరుమల దేవి, ప్రధాన కార్యదర్శి రేణుక, యువజన విభాగం జాతీయ అధ్యక్షురాలు మంజుల, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు  రమ, కార్మిక విభాగం అధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.