ముషీరాబాద్, డిసెంబర్ 13 : కవులు, కళాకారుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా తనవంతు కృషిచేస్తామని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల గద్దర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు.
శుక్రవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ కవి, గాయకుడు నేర్నాల కిషోర్ ఆధ్వర్యంలో 32 గంటల పాటు ‘దగాపడ్డ కళాకారుల డప్పుల మోత’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వెన్నెల గద్దర్, బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ. కళాకారులకు సాంస్కృతిక శాఖలో ఉద్యోగాల విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు.