calender_icon.png 22 December, 2024 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా

22-12-2024 03:08:38 AM

* రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్

ముషీరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ అన్నారు. శనివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.

కార్యక్రమానికి వెన్నెల గద్దర్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ఉద్యమ కళాకారుల పాత్ర మరువలేనిదన్నారు. మన ఆటా, పాటలతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉదృతం చేసిన ఘనత ఉద్యమకారులదేనని అన్నారు. ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోదని, వారిని ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కళాకారుల విభాగం కన్వీనర్ పోశెట్టి, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి,  కళాకారులు పాల్గొన్నారు.