చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, ఫిబ్రవరి 1 : కొండకల్, వెలిమల తండాలోని భూ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య హామీ ఇచ్చారు. శంకర్పల్లి మండల పరిధి కొండకల్, వెలిమల తండా పరిధిలోని రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ నుంచి గుంజుకున్న 80 ఎకరాల బిలాదాఖలు భూములను విడిపించాలని 22 రోజులుగా చేస్తున్న రిలే దీక్షల వద్దకు శనివారం వెళ్లారు.
ఈ సందర్భంగా చేవెళ్ల ఆర్డీవో, శంకర్పల్లి తహసీల్దార్లకు ఫోన్చేసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆక్రమణకు గురైన భూములను పరిశీలించి.. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, శంకర్పల్లి మాజీ వైస్ ఎంపీపీ ప్రవళికా వెంకట్రెడ్డి, రవి, శంకర్, బాబు, బాలు, శంకరమ్మ, రెడ్యా లక్ష్మణ్, గోపాల్, చందర్, మోహన్, లక్ష్మణ్, గోమా, బాల్రాజు, నహీం, సుధాకర్, నర్సింహా చారి, మల్లేశ్, కొండకల్ మాజీ వార్డు సభ్యుడు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మర్రివాగు రాజు తదితరులు పాల్గొన్నారు.