calender_icon.png 6 November, 2024 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి తెస్తాం

04-11-2024 01:03:14 AM

  1. యూసీసీ నుంచి గిరిజనులను మినహాయిస్తాం
  2. ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన అమిత్‌షా

న్యూఢిల్లీ, నవంబర్ 3: జార్ఖండ్‌లోకి అక్రమ వలసలను నిలువరిస్తామని కేంద్ర హోంమ ంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చొరబాటుదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకు నేందుకు చట్టం తెస్తామన్నారు. ఆదివారం రాంచీలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్‌షా సంకల్ప్ పత్ర  పేరుతో బీజేపీ మ్యానిఫె స్టో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సోరెన్ పాలనలో అక్రమ వలసదా రుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సంతాల్ పరగణలో గిరిజన జనాభా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) ప్రవేశపెట్టి, దాని నుంచి గిరిజనులను మినహాయి స్తామన్నారు. పేపర్ లీక్‌లకు పాల్పడుతున్న వారిపై సీబీఐ, సిట్ సోదాలు నిర్వహించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలు

  1. ఉమ్మడి పౌరస్మృతి అమలు (గిరిజనులకు మినహాయింపు)
  2. గోగో దీదీ స్కీమ్ కింద మహిళలకు నెలకు రూ.2,100 నగదు
  3. నిరుద్యోగులకు నెలా 2 వేల భృతి
  4. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఏడాదికి 2 ఉచిత సిలిండర్లు
  5. ఖాళీగా ఉన్న అన్నీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు