calender_icon.png 1 April, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీపీకి పూర్వవైభవం తీసుకువస్తాం

30-03-2025 12:00:00 AM

సికింద్రాబాద్ టీడీపీ అధినేత వల్లారపు శ్రీనివాస్

వారసిగూడ (విజయక్రాంతి) మార్చి 29 : తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ్వాన్ని పురస్కరించుకొని సీతఫలమండీ డివిజన్ తెదేపా అధ్యక్షుడు జీవీ.కృష్ణ నామాలగుండు కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ముఖ్య అతిధులుగా తెదేపా వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌టిఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, తెదేపా సికింద్రాబాద్ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ విచ్చేసారు.

నందమూరి రామకృష్ణ పార్టీ పతకావిష్కరణ చేసి, కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు, నాయకురాళ్లకు తినిపించారు. ఈ సందర్భంగా నందమూరి రామ కృష్ణ మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొం దిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ప్రాం తాలు వేరైనా తెలుగువారి అంతరంగం ఒక్కటేనని చాటిన వ్యక్తి ఎన్‌టిఆర్ అన్నారు.

తెలుగుదేశం గడ్డను అభివృద్ధి వైపు నడిపేందుకు పుట్టిన పార్టీ తెలుగుదేశం అని, కార్యకర్తల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ  ఇం చార్జ్ వల్లారపు శ్రీనివాస్ మాట్లాడుతూసికింద్రాబాద్‌లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే పరమావధిగా పనిచేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకులు కార్యకర్తలు పుష్కళంగా ఉన్నారని వారి సహకారంతో పార్టీని మరింత బలోపేతంచేస్తామని పేర్కొన్నారు.