calender_icon.png 23 April, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లాకు పూర్వవైభవం తెస్తాం

23-04-2025 12:10:33 AM

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): నిజామాబాద్  జిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం స్థానిక  కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తో కలిసి మహేష్ కుమార్ గౌడ్ మీడియా తో మాట్లాడారు. జిల్లా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, అనుభవజ్ఞులైన నిపుణులతో మూడు రోజుల పాటు రైతు మహోత్సవ కార్యక్రమం చేపట్టిందని, చెప్పారు. రైతే దేవుడు అని నమ్మి రైతు క్షేమంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం తమది అని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల అతి దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు.

రైతులపై లాఠీ చార్జీలు, చేతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్ దని విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన  రైతు వ్యతిరేక చట్టాలకు ఓటు వేసిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీకే దక్కిందన్నారు. వరి రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నమని స్పష్టం చేశారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే టాప్ లో నిలిచిందని ఉద్ఘాటించారు.  నిజాంసాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ల పూడిక పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాకు నీరు రావాలని ప్యాకేజీ 21, 22, 23 తీసుకువచ్చిన  ఘనత సుదర్శన్ రెడ్డిది అని కొనియాడారు.   జిల్లాకు వ్యవసాయ కళాశాల నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.

జిల్లాలో మినీ స్టేడియం మరియు సింథటిక్ ట్రాక్ ఏర్పాటుచేసి,ఇండోర్ గేమ్స్ , ఇండోర్ స్టేడియం  ఆయన తెలిపారు. పారిశ్రామిక  అభివృద్ధిలో భాగంగా నందిపేట సేజ్  పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ స్థాపనకు సుదర్శన్ రెడ్డి  కృషి చేస్తున్నారని ప్రశంసించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో ప్రశాంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.  మళ్ళీ 90 సీట్లతో అధికారంలోకి వసా ని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులడు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందం, నూడ చైర్మన్ నగర అధ్యక్షులు కేశ వేణు, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్ పాల్గొన్నారు.