calender_icon.png 10 January, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట తప్పిన ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం తెస్తాం

05-01-2025 06:10:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఎన్నికలకు ముందు ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే వరకు కేటీఆర్ పిలుపు మేరకు ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా చైతన్యం తెస్తామని టిఆర్ఎస్ సోషల్ మీడియా ఉపాధ్యక్షులు రిజ్వాన్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం తిరిగి దరఖాస్తుల స్వీకరించడం రైతులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. కౌలు రైతులకు 12000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం మాట తప్పిందన్నారు. రేషన్ కార్డుల మంజూరు మహిళలకు 2500 పెన్షన్ వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్ పెంపు పథకాలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దీనిపై బీఆర్ఎస్ పిలుపు మేరకు సోషల్ మీడియాలో ప్రజలను చైతన్యం చేస్తామని పేర్కొన్నారు.