తెలంగాణలో కులగణన వీడియోను పోస్ట్ చేసిన రాహుల్
న్యూఢిల్లీ, నవంబర్ 9: తెలంగాణలో జరుగుతున్న కులగణన ప్రక్రియను త్వరలో మహారాష్ట్రలో కూడా చేపడతామని దీంతో రిజర్వేషన్లపై 50శాతం గోడలను బద్దలు కొడతామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో కులగణన జరుగుతున్న వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఈ సందర్భంగా మోదీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ.. ‘మోదీజీ తెలంగాణలో నేటి నుంచి కులగణన ప్రారంభమైంది. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించడానికి సంబంధిత డాటా ద్వారా మేము ప్రయత్నిస్తాం. ఇక దేశంలో సమగ్ర కులగణన జరపడం బీజేపీకి ఇష్టం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.
మోదీజీకి నేను ఒకే ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటన్నా.. దేశవ్యాప్తంగా కులగ ణనను ఎవరూ ఆపలేరు, అలాగే పార్లమెంట్‌లో కులగణనను ఆమోదించి రిజర్వేషన్లపై ఉన్న 50శాతం అడ్డుగోడలను బద్దలు కొడతాం’ అని రాహుల్ స్పష్టం చేశారు.