calender_icon.png 8 January, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాం

07-01-2025 01:45:32 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఆదిలాబాద్/కుమ్రంభీం ఆసిఫాబాద్/నిర్మల్, జనవరి 6 (విజయక్రాంతి): రైతులు, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై కాంగ్రెస్ ప్రభుతం కక్ష గట్టి కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తోందని, ధైర్యంతో ప్రభుత్వాన్ని ఎదుర్కుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సైతం ఏసీబీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, వీరి బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరని పేర్కొన్నారు.

సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపాన్ని ఆమె సందరించి, నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, వాంకిడి మండలాల్లో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్‌తో కలసి ఆమె పర్యటించారు. నిర్మల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో, ఆసిఫాబాద్‌లోని కోవ లక్ష్మి నివాసం వద్ద మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలను పొట్టానబెట్టుకున్నదని కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోడు భూములకు హక్కులు కల్పించిందన్నారు.

జైనూర్ మండలంలో ఆదివాసి మహిళపై జరిగిన ఘటనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున్న అల్లర్లు జరిగాయని ఆరోపించారు. సదరు మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల అరోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదని, ఇందుకు నిదర్శనం వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి చెందిన శైలజ మృతియేనన్నారకు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 57 మంది విద్యార్థులు మృతిచెందినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగుతున్నదన్నారు. అందులో భాగమే కేటీఆర్‌పై కేసు అని చెప్పారు.

ధైర్యంతో ప్రభుత్వాన్ని ఎదుర్కుంటాం అని పేర్కొన్నారు. పర్యటన సందర్భంగా జైనూర్, కెరమెరి, ఆసిఫాబాద్, వాంకిడిలో బీఆర్‌ఎస్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆమెవెంట సివిల్ సప్లయి కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, బీఆర్‌ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కె రాంకిషన్‌రెడ్డి ఉన్నారు.