calender_icon.png 20 March, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్నాబాద్ క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం

19-03-2025 12:00:00 AM

30 రోజుల్లో ముల్కనూర్‌లో ఆసుపత్రి కేటాయించాల్సిందే..

భీమదేవరపల్లి మార్చి 18 (విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఒక నెలలోగా 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయకపోతే స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాల యం ముట్టడిస్తామని బిజెపి జిల్లా నాయకులు పైడిపల్లి పృథ్వీరాజ్ హెచ్చరించారు. భీమదేవరపల్లి మండల కేంద్రం ముల్కనూరులో బీజేపీ మండల అధ్యక్షులు శ్రీరామో జు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. 

పృథ్విరాజ్‌గౌడ్ మాట్లాడు తూ  మూడు మండలాలు అక్కన్నపేట్, భీ మదేవరపల్లి, ఎల్కతుర్తి  మండలాలకు రవా ణా సౌకర్యం కలిగివున్న ఈ ప్రాంతంలో 30 రోజులల్లో 30 పడకల హాస్పిటల్ కేటాయించకపోతే  24 గ్రామాల ప్రజలను హుస్నాబా ద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తాం అని హెచ్చరించడం జరిగింది.

ఎమ్మెల్యేగా గెలిచే ముందు రోజుకో గ్రామంలో పాదయాత్ర చేస్తా అని 15 నెలల్లో ఒక్క గ్రామం లో కూడా పాదయాత్ర చెయ్యకుండా కనీ సం పేద ప్రజలను కూడా పరా మర్శించ కుండా  పాలనను కొనసాగిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కొనసాగిస్తున్నారన్నారు .

నరేంద్రమోడీ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎల్కతుర్తి నుండి మెదక్ వరకు 850 కోట్లతో 4 లైన్ రోడ్డు వేస్తుంటే పరిశీలిస్తున్నవ్ కానీ పేద బడుగు బలహీన వర్గా ల కోసం హాస్పిటల్ కట్టించలేకపోతున్నావు  ఇది మంత్రి పాలనకు నిదర్శనం అన్నారు.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు దొంగ ల కొమరయ్య. పైడిపల్లి పృధ్విరాజ్, గండు సారయ్య. గుండెల్లి సదానందం, తీగల రా జు, దొంగల వేణు, లక్కిరెడ్డి మల్లారెడ్డి, దొం గల రాణా ప్రతాప్, బొజ్జపురి  పృథ్వీ, సదానందం, సిద్ధమళ్ళ రమేష్, పోడేటి బిక్షపతి, ప్రదీప్‌రెడ్డి, రాంనగర్ శ్రీకాంత్, సాయినవీ న్. అలుగు భాస్కర్ రమేష్ పాల్గొన్నారు.