calender_icon.png 27 December, 2024 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటరి మహిళకు పింఛన్ ఇవ్వకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం

09-07-2024 03:33:19 PM

మంచిర్యాల : బెల్లంపల్లికి చెందిన ఒంటరి మహిళ కాంత లక్ష్మి (55)కు గత కొద్ది నెలలుగా పింఛను అందడం లేదని ఎంసీఐయూ పార్టీ జిల్లా కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆరోపించారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ... అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే పింఛన్ అందడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు కాంత లక్ష్మికు పింఛన్ అందించి ఆమెను ఆదుకోవాలని కోరారు. లేనట్లయితే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐయూ నాయకులు ఆరేపల్లి సతీష్, ఆరేపల్లి రమేష్ లు పాల్గొన్నారు.