19-03-2025 02:33:08 AM
ఆదిలాబాద్, మార్చ్ 18 (విజయ క్రాంతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయివేటీకరణ విధానాల ద్వారా ఐసిడిఎస్ క్రమంగా నిర్వీర్యం చేయాలని చూస్తుందని, ఇందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తెచ్చిందని, ఇది అమలు జరిగితే ఐసిడిఎస్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఐసిడిఎస్ లేకుండాపోయే పరిస్థితి దారితీస్తుందని నాయకులు అన్నోళ్ల కిరణ్, బొజ్జ ఆశన్న అన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మండుటెండలో సైతం గంటల తరబడి నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీలందరూ ఐసీడీఎస్ పరిరక్షణ, బలోపేతంకోసం పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తున్నారని అన్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా బడ్జెట్ లో icds కు నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తున్నదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు లింగాల చిన్నన్న, గంగన్న, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.