కార్మిక సంఘాల జేఏసీ పిలుపు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8(విజయక్రాంతి): బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్‌ను ముట్టడించాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమా వేశంలో వారు మాట్లాడారు. బొగ్గు బ్లాకులను వేలం వేసి ప్రవేటు సంస్థలకు అప్పగించేందుకు తీసుకొన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా, కార్మిక ఉద్యమాల ద్వారా తిప్పికొట్టి సింగరేణి సంస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వంగ వెంకట్, కంచర్ల జమలయ్య, జీ వీరస్వామి, బహ్మచారి, రాజారావు, భూక్యా రమే ష్, చంద్రశేఖర్, అలీ పాల్గొన్నారు.