calender_icon.png 28 October, 2024 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణగారిన వర్గాల గొంతుకగా మారుతాం

08-07-2024 02:44:09 AM

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం అంతిమ దశలో ఉందని, అంతిమ పోరాటంలోనూ ధర్మమే గెలుస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 ఏళ్లు అయిన సందర్భంగా పార్శీగుట్టలో ఆదివారం సంఘం జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించి జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెళ్ల కిశోర్ బాబు, మాజీ ఎంపీ బీ వెంకటేశ్ నేత, బీసీ నేత కందుకూరు జగదీశ్వర్ రావు, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సీహెచ్ సోమశేఖర్, సీనియర్ నాయకులు రాగటి సత్యం, తిప్పారపు లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు టీవీ నరసింహారావు, ఎంజేఎఫ్ జాతీయ నాయకులు సుంచు అశోక్, చాటింపు అశోక్, రమేశ్ పాల్గొన్నారు. 

ఓయూలో ఆవిర్భావ వేడుకలు..

ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలే జీ ఎదుట మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మా ర్పీఎస్ జెండాను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ ఆవిష్క రించారు. ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సీహెచ్ సోమశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ, ఓయూ అధ్యక్షుడు మంద రాజు మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి పల్లెర్ల సుధాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

వర్గీకరణ సాధించుకోవాలి.. 

మాదిగలు ఆత్మ గౌరవంతోనే వర్గీరణ సాధించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగ దండోర 30 ఏళ్ల ఆవిర్భావ సదస్సు రవీంద్రభారతీలో ఆదివారం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మానకొండూరు ఎమ్మెల్యే కంభంపల్లి సత్యనారా యణ, ప్రొఫెసర్లు మల్లేశం, ఇటిక్యాల పురుషోత్తం, డాక్టర్ ఆడం, ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, కోర్ కమిటీ సభ్యులు పీ గెల్వయ్య, గుర్రాల శ్రీను, నాగారం బాబు, యాదగిరి  పాల్గొన్నారు.  

వర్గీకరణ చేయకపోవడంతో మాదిగలకు అన్యాయం: వంగపల్లి 

ముషీరాబాద్, జూలై 7: ఎస్సీ వర్గీకరణ చేయకపోవడంతో మాదిగలు విద్య, ఉద్యోగావకాశాల్లో నష్టపోతున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు.  ఆదివారం ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్‌లో వర్గీకరణ సాధన కై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్, బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ప్రజా గాయని విమలక్క, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఏపూరి సోమన్న, తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నరేందర్  హాజరై మద్దతు తెలిపారు. 

250 గజాల స్థలం కేటాయించాలి..

ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వారికి 250 గజాల స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు జున్ను కనకరాజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాదిగల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.