20-03-2025 01:05:07 AM
మహబూబ్ నగర్ మార్చి 19 (విజయక్రాంతి) : ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకుగాను ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఎమ్మార్పీఎస్ ఆర్‌ఆర్ జిల్లా ఇంచార్జ్ రాజధాని అశోక్ అన్నారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని మెట్టిగడ్డి దగ్గర ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయకండి రాందాస్ జిల్లా అధ్యక్షులు ఎల్ రమేష్, బేడా బుడగ జంగం జిల్లా నాయకులు సిరిగిరి విజయ్, సిరిగిరి యాదయ్య తిరుమలయ్య, సిరిగిరి ఎల్లా భగవంతు, స్వామి మొదలయ్య తదితరులు ఉన్నారు.