calender_icon.png 9 January, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా కుంభమేళాపై దాడిచేస్తాం

07-01-2025 12:43:47 AM

* ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరిక

* “ప్రయాగ్ రాజ్ చలో” అంటూ పిలుపు

* పిచ్చివాడి చర్యగా పరిగణించిన అఖాడా పరిషత్

న్యూఢిల్లీ, జనవరి 6: ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయా గ్ రాజ్‌లో జరగనున్న మహాకుంభ్‌పై దాడి చేస్తామని నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ సంస్థ నాయకుడు, ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజాగా బెదిరింపు వీడియోను విడుదల చేశాడు.

సదరు వీడియోలో హిందూత్వ భావజాలాన్ని వ్యతిరే కించడానికి, అంతం చేయడానికి “ప్రయాగ్ రాజ్ చలో..”  పిలుపునిచ్చాడు. లక్నో, ప్రయాగ్ రాజ్ ఎయిర్‌పోర్టుల్లో ఖలిస్తానీ, కశ్మీర్ జెండాలు ఎగరవేయాలని తన మద్దతుదారులను కోరాడు. వీడియో ముగింపు లో “మహా కుంభ్ ప్రయాగ్‌రాజ్ 2025 యుద్ధభూమిగా మారుతుంది” అని ప్రకటించాడు.

పది రోజుల వ్యవధిలో మహా కుంభ్ ను లక్ష్యంగా చేసుకుని పన్నూ హెచ్చరిక జా రీ చేయడం ఇది రెండోసారి. అతడు మకర సంక్రాంతి(జనవరి 14), మౌని అమావాస్య(జనవరి 29), వసంత పంచమి(ఫిబ్రవరి 3)తో సహ ముఖ్యమైన స్నానాలు ఆచరించే రోజులను దెబ్బతీస్తామని హెచ్చరించాడు.

పన్నూ హెచ్చరిక వీడియోను అఖిల భారతీయ అఖాడా పరిషత్ తీవ్రంగా ఖండిం చింది. పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపూరి మాట్లాడుతూ.. పన్నూ  ఓ పిచ్చివాడు అంటూ విమర్శించారు. పన్నూ అనే వ్యక్తి మహా కుంభ్‌లోకి ప్రవేశించడానికి ధైర్యం చేస్తే ప్రజలు అతన్ని కొట్టి బయటకు పంపుతారని, ఇలాంటి పిచ్చివాళ్లను వందలాది మందిని చూశామని చెప్పారు.