23-02-2025 06:42:43 PM
మూడు విడతల ఉచిత కంటి వైద్య శిబిరాలలో 1781 మందికి వైద్య పరీక్షలు, 324 మందికి కంటి ఆపరేషన్ పూర్తి..
కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మూడో విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఉచిత శిబిరాలలో మూడు విడతలలో 1781 మందికి పరీక్షలు నిర్వహించి 324 మందికి ఆపరేషన్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కి చెందిన శంకరా కంటి ఆసుపత్రి, ఫీనిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలకు అపురూపమైన స్పందన వస్తోంది. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మెరుగైన కంటి చూపు వచ్చేంతవరకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని తెలిపారు. మూడవ విడతలో 152 మంది ఆపరేషన్కు ఎంపిక కాగా 110 మందిని హైదరాబాద్కు తరలించారు.