calender_icon.png 6 February, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42% సీట్లు కేటాయిస్తాం!

06-02-2025 12:26:04 AM

  1. కులగణనపై ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు
  2. సర్వేను పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాం
  3. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతి ష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనపై ప్రజ ల్ని తప్పుదోవ పట్టించొద్దని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లను కచ్చితంగా కేటాయిస్తామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధ వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

రాజకీయాలు చేసేందుకు ఇది సమ యం కాదన్నారు. ‘కులగణన సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఇంటింటికెళ్లి వివరాలు సేకరించాం. ఆ సమా చారం ఆధారంగానే నివేదికను రూపొందించాం. అయినా.. కొందరు పనిగట్టు కుని నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయ త్నిస్తున్నారు’ అని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు.

‘అప్పటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం సమగ్ర కుటుంబ సర్వేను అశాస్త్రీయంగా నిర్వహించింది. పారదర్శకతకు పాతరేసి తప్పుల తడకగా నివేదికను తయారు చేసింది. సర్వే చేయించిన వారు ఆ వివరాలను ప్రజల ముందు పెట్టలేకపోయారు. శాసనసభలో పెట్టే సాహసం చేయలేదు. ఆ సర్వేకు ఎటువంటి ప్రామాణికత లేదు. అయినా దా ని ప్రస్తావన 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెస్తున్నారు.

ఆ తప్పును మేం సరిదిద్దాం. అందుకు మమ్మల్ని అభినందించకపోగా విమర్శించడం ఎంత వరకు సమంజసం?’ అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఇప్ప టికీ.. ఎప్పటికీ బీసీలకు అండగా ఉండేదిద కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకు బీసీ డిక్లరేషన్‌ను నూటికి నూరుశాతం అమ లు చేసి తీరుతామని పేర్కొన్నారు.

స్థాని క ఎన్నికల్లో బీసీలకు 42శాతం సీట్లు ఇస్తామని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు చెప్పగలవా? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం చేయలేని ఎన్నో పనులను తమ ప్రభుత్వం ఏడాదిలోనే పూర్తి చేసిందన్నారు. అది తట్టుకోలేకే ఆ పార్టీ నేతలు తమ ప్రభుత్వపై నిరాధార ఆరోపణలను చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

వారికి బీజేపీ నేతలు కూడా వంత పాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని ప్రజలకు సూచించారు.