calender_icon.png 10 October, 2024 | 9:59 PM

600 కొత్త శాఖల్ని జతచేస్తాం: ఎస్బీఐ చైర్మన్

03-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో తమ బ్రాంచ్ నెట్‌వర్క్‌లో కొత్తగా 600 శాఖల్ని జతచేయాలని యోచిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. నూతనంగా ఆవిర్భవిస్తున్న రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌ల్లో వ్యాపార అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు శాఖల్ని భారీగా విస్తరించాలన్న ప్రణాళికలు ఉన్నాయని, ప్రస్తుత ఏడాదే 600 శాఖల్ని ప్రారంభిస్తామన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 137 శాఖల్ని ప్రారంభించగా, అందులో 59 శాఖల్ని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పింది. 2024 మార్చినాటికి దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 22,542 శాఖలు ఉన్నాయి. ఇవి కాకుండా బ్యాంక్‌కు 65,000 ఏటీఎంలు, 85,000 బిజినెస్ కర్‌స్పాండెంట్‌లు ఉన్నారు. తాము 50 కోట్ల మంది ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామని ప్రతీ భారతీయు కుటుంబానికి బ్యాంకర్‌గా ఉన్నందుకు తాము గర్విస్తున్నామని శెట్టి చెప్పారు.