* దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు కృష్ణస్వరూప్
ముషీరాబాద్, జనవరి 17: అంబేద్కర్ వాది, దళిత బహుజన విద్యార్థి ధృవతార వేముల రోహిత్ చక్రవర్తి ఆశయ సాధనకు కృషి చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని డీబీపీ జాతీయ కార్యాలయంలో హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్, దళిత బహుజన విద్యార్థి ధృవతార రోహిత్ వేముల చక్రవర్తి 9వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. డీబీఎస్‌ఎఫ్ రాష్ట్ర కో గణేష్, జాయింట్ కోఆర్డినేటర్ రవీందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.