calender_icon.png 31 October, 2024 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తాం

01-08-2024 08:30:00 AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

హైదరబాద్, జూలై 31 (విజయక్రాంతి): ఏపీలో సరికొత్త పాలసీలు అమలు చేసి పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలోని సచివాలయంలో బుధవారం పరిశ్రమలశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేయించామని, తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ అలసత్వం కారణంగా పెట్టుబడులన్నీ వెనక్కి వెళిపోయాయని ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు, రాజకీయ పరమైన వేధింపులకు గురిచేయడంతోనే ఎన్నో కంపెనీలు ఒప్పందాలను రద్దు చేసుకున్నాయన్నారు.

ఆ తర్వాత కొత్త కంపెనీలేవీ ఏపీకి రాలేదన్నారు. పారిశ్రామిక అవసరాలకు తీసుకున్న భూములను కూడా గత ప్రభు త్వం ఇతర అవసరాలకు వినియోగించిందన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు తమ హయాంలో 66 శాతం ప్రోత్సాహకాలు చెల్లిస్తే, గత ప్రభుత్వం ప్రభుత్వంలో 34 శాతం మాత్రమే ఇచ్చిందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించి, పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని సంబంధిత అధికారు లను అదేశించారు. వచ్చే 100 రోజుల్లో ఇండస్ట్రీయల్, ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్  క్లౌడ్, టెక్స్ టైల్ పాలసీలు అమలు చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా చేయాలనే లక్ష్యంతో పాలసీలు అమలు చేస్తున్నామన్నారు.