calender_icon.png 31 October, 2024 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యాభర్తలమే.. కానీ విడిపోయాం

29-10-2024 12:37:36 AM

వివాదాస్పదంగా 

పూజా ఖేడ్కర్ తండ్రి 

ఎన్నికల అఫిడవిట్

గతేడాది భార్య మనోరమతో  కలిసే ఉన్నట్లు వెల్లడి

ముంబై, అక్టోబర్ 28: యూపీఎస్సీ అభ్యర్థిత్వం రద్దున వివాదాస్పద ప్రొబెషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె తండ్రి దిలీప్ ఖేడ్కర్ త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  అహ్మద్‌నగర్ సౌత్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నారు. ఈమేరకు ఈసీకి ఆయన ఇచ్చిన అఫిడవిట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇటీవల 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ తరఫున పోటీచేసిన ఖేడ్కర్ అప్పట్లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌కి భిన్నంగా ప్రస్తుత ప్రమాణపత్రం ఉండ టమే దీనికి కారణం.

పాత అఫిడవిట్‌లో దిలీప్ మనోరమ (పూజాఖేద్కర్ తల్లి)ను తన భార్యగా పేర్కొన్నారు. ప్రస్తుతం తాము విడాకులు తీసుకున్నట్లుగా చూపించారు. అయితే దిలీప్, మనోరమ 2009లోనే పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, అయినా ఈ జంట పుణెలో సహజీవనం కొనసాగిస్తున్నారనే  వార్తలు వెలువడ్డాయి.