calender_icon.png 16 January, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పసుపు బోర్డు’ను స్వాగతిస్తున్నాం!

16-01-2025 02:43:32 AM

* గోడౌన్, కోల్డ్ స్టోరేజ్ సైతం ఏర్పాటు చేయాలి 

* కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విజ్ఞప్తి 

హైదరాబాద్, జనవరి 15 ; నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నా  ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, పసుపుకు మద్దతు ధర ఇప్పించాలని, గోడౌన్లతో పాటు కోల్డ్ సోరేజ్ వంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బుధవారం నిర్వహించిన మీడి  సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర్డుకు ప్రత్యేక కార్యాలయంతోపాటు ప్రత్యేక నిధి సైతం కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొర  తీసుకుని చక్కెర కార్మాగారాన్ని పునః ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పసుపు బోర్డు చైర్మన్‌గా నియమితులైన పల్లె గంగారెడ్డికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.