calender_icon.png 16 November, 2024 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బుల్డోజర్ న్యాయం’పై ‘సుప్రీం’ తీర్పును స్వాగతిస్తున్నాం!

04-09-2024 01:58:48 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: అక్రమ కట్టడాల కూల్చివేతపై ‘బుల్డోజర్ న్యాయం’పై సోమవారం యావత్ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని సుప్రీం కోర్టు ఎండగట్టిందని కొనియాడారు. తక్షణ న్యాయం అనే సాకు చూపి, సమాజంలో భయానక  వాతావరణం నెలకొల్పడమే బీజేపీ ధ్యేయమని ఆరోపించారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పౌర హక్కుల ఉల్లంఘన జరిగిందని మండిపడ్డారు. బుల్డోజర్ సంస్కృతిలో ఎక్కువగా నష్టపోయిందని దళితులు, బహుజనులైన నిరుపేదలేనని స్పష్టం చేశారు.

రాజ్యాంగ విరుద్ధం: అఖిలేశ్ 

సుప్రీంకోర్టు తీర్పుపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. కట్టడాల కూల్చివేతకు బుల్డోజర్లు వినియోగించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఇదే విషయంపై తమ పార్టీ ఎంతో కాలం నుంచి గళమెత్తుతున్నదని, ఎట్టకేలకు ఈ సమస్యకు సుప్రీం కోర్టు పరిష్కారం చూపడం ఆనందా న్నిచ్చిందని పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..

ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అక్రమ కట్టడాల పేరుతో బుల్డోజర్లతో వాటిని కూల్చివేసే సంస్కృతిపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. అక్రమంగా నిర్మాణాలు చేపట్టి, అతను దోషి అని తేలిన కూడా ఆ కట్టడాలను కూల్చివేసేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. స్థానిక మున్సిపల్ చట్టాల ప్రకారం నడచుకోవాలని కీలకమైన తీర్పు వెలువరించింది. ఈ ఆదేశాలు ఒక్క ఉత్తప్రదేశ్‌కే కాదని, దేశంలోని అన్ని రాష్ట్రప్రభుత్వాలకూ వర్తిస్తాయని తేల్చిచెప్పింది.