బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): విద్యుత్ విచా రణ కమిషన్ చైర్మన్ నరసిం హారెడ్డిని తప్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. బుధవారం మాట్లాడుతూ.. విద్యుత్ కమిషన్‌కు కేసీఆర్ లేఖ రూపంలో సమాధానం ఇచ్చారని, ఆ లేఖలో నరసింహారెడ్డి వ్యక్తిగత విషయాలను కేసీఆర్ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. నరసింహారెడ్డి ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను బాహాటంగా తప్పు బట్టారని, వీటిని పరిగణనలోకి తీసుకున్నాకే సుప్రీంకోర్టు ఆయనను చైర్మన్ భాధ్య తల నుంచి తప్పించిందన్నారు. చైర్మన్ భాద్యతల నుంచి తప్పుకున్నాక కూడా ఆయన స్థాయిని మరిచి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. విచారణను ఎదుర్కొంటున్న కవితను ముందే దోషి అన్నట్టుగా నరసింహారెడ్డి మాట్లాడారని, నేరం రుజువయ్యేంత వరకు ఎవరూ దోషులు కారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.