calender_icon.png 17 April, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

14-04-2025 12:00:00 AM

మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): గవర్నర్ల నిర్ణయాలకు టైమ్‌లైన్‌ను నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు. లెక్కలేనన్నిసార్లు బీజేపీ, కాంగ్రెస్‌లు తమ పాలనలో అవరోధాలు సృష్టించేందుకు గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేశాయని ఆరోపించారు.

అసెంబ్లీ స్పీకర్లు రా జ్యాంగాన్ని ప్రబలంగా దుర్వినియోగం చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై వారికి సుప్రీంకోర్టు టైమ్‌లైన్ నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు.