calender_icon.png 19 April, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం

17-04-2025 01:24:59 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు

* వన్యప్రాణులను కాపాడాలంటూ సీఎస్, రాష్ట్ర చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడం గొప్ప విజయం. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం అండగా నిలబడిన హెచ్‌యూసీ విద్యార్థులకు ధన్యవాదాలు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి.

  1. ఇప్పటికైనా పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడం హర్షణీయమని బుధవారం ఎక్స్‌లో పెర్కొన్నారు. వన్యప్రాణులను కాపాడాలంటూ సీఎస్, రాష్ట్ర చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌కు ఆదేశాలివ్వడం గొప్ప విజయమని తెలిపారు.

ఇది వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతీఒక్కరి విజయమని కేటీఆర్ చెప్పారు. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం అండగా నిలబడిన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని కాపాడి, హైదరాబాద్ భవిష్యత్ కోసం పోరాడిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సులను బీఆర్‌ఎస్ స్వాగతిస్తోందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు వ్యవహారంలో పదివేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. అడవులు, వన్యప్రాణుల పట్ల రేవంత్‌రెడ్డి విలన్‌గా మారారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి తనను తాను మోసం చేసుకున్న విషయాన్ని అర్థం చేసుకొని పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.