14-02-2025 12:50:29 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సమగ్ర కుటుం సర్వే నిర్వహించాలని ప్రభుత్వం తీసుకు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జా శ్రీనివాస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.
గురువారం లక్డీకాపూల్‌లో నిర్వహించిన మీడియా సమా మాట్లాడుతూ రీసర్వేలో ప్రజలంతా పాల్గొనేలా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. గతంలో నిర్వహించిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాలు, హైదరాబాద్‌లోని బస్తీలు, కాలనీల్లోని ప్రజలు ఎక్కువ మంది పాల్గొనలేదని, దాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యానువల్‌గా కూడా సమగ్ర కుటుంబ సర్వే చేయాలని కోరారు.
సర్వేను మార్చి 2 వరకు పొడగించిలా ప్రయత్నించాలని సూచించారు. బీసీల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీసీ సంక్షేమ సంఘం, ఇతర సంఘాల ఆధ్వర్యంలో మార్చి 9న తలపెట్టిన ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు జాజుల పేర్కొన్నారు. బీసీల లెక్క తేలితే తెలంగాణలో బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్‌లలో ఎవరో ఒకరు సీఎం కావొచ్చంటూ కామెంట్ చేశారు.